financial assistance | రాయపోల్ ఏప్రిల్ 14: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గత వారం రోజుల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న కొమ్మాయిపల్లి రామస్వామి కుటుంబానికి అండగా నిలిచేందుకు స్నేహితులు ముందుకొచ్చారు. పదవ తరగతి 2002-2003 బ్యాచ్‌కు చెందిన రామస్వామి స్నేహితుల బృందం ఇవాళ ఆర్థిక సాయం అందజేశారు.
వారంతా కలిసి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక మంచి మిత్రుని కోల్పోయామని రామస్వామిని గుర్తు చేసుకొని సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రామస్వామి కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ వంతు సహాయంగా రూ. 19,000/- అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత వంజరి హనుమంతు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ ప్రసాద్ గౌడ్, ఎలుక స్వామి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బక్కోళ్ల దుర్గయ్య, సీనియర్ జర్నలిస్ట్ మన్నె సురేష్, బాలపోసి, యాదగిరి, వంజరి, సతీష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.