రాయపర్తి : భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయిలో చాటడంలో చేసిన సేవలు చిరస్మరణీయమైనవని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, చేరికల కమిటీ మండల చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఊకల్, మైలారం, రాయపర్తి మండల కేంద్రంలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నింటిలో కెల్లా అత్యున్నతమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ మార్గదర్శిగా పని చేశాడు అన్నారు.
అంబేద్కర్ ఆశయాల సాధన కోసం సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా ఆయన కోరారు. రిజర్వేషన్ల రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ కు బడుగు బలహీన వర్గాలని జీవితకాలం రుణపడి ఉంటారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి మండల నాయకులు జనుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, లేతాకుల రంగారెడ్డి, భూక్య సురేందర్ రాథోడ్ నాయక్, సంధి దేవేందర్ రెడ్డి, కుందూరు రామచంద్రారెడ్డి, పోలేపాక భిక్షపతి, బొడ్డు రంగయ్య, యాదగిరి రెడ్డి, తాళ్లపల్లి సంతోష్ గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, గజవెల్లి ప్రసాద్, చిలువేరు సాయి గౌడ్, అస్రఫ్ పాషా, ఎల్లస్వామి, యాకయ్య, గొల్లపల్లి సదా శీను, పాము మనోహర్ తదితరులు పాల్గొన్నారు.