Government School | చేర్యాల, ఏప్రిల్ 29 : సర్కారు బడిలో అభ్యసించిన వారే నేడు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని సిద్దిపేట జిల్లా సెక్టోరియిల్ అధికారి భాస్కర్, ఎంఈవో రచ్చ కిష్టయ్య తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని.. దీంతో వారికి ఉన్నత స్ధానంలో ఉచితంగా చదువు వసతి కలుగుతుందని వారు తెలిపారు.
ఇవాళ మండలంలోని ఆకునూరు, కాశేగుడిసెల గ్రామాల్లో జిల్లా సెక్టోరియల్ అధికారి, ఎంఈవో, ఉపాధ్యాయులతో కలిసి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్టోరియల్ అధికారి, ఎంఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలున్న ఉపాధ్యాయులు ఉంటారని.. వారి పర్యవేక్షణ, బోధనతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు. ఉచితంగా యూనిఫామ్స్, ఉచిత పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్ బోధన, సాంకేతికపరంగా విద్యాబోధన అందించడం జరుగుతుందని తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటుకు పంపించకుండా సర్కారు బడికి పంపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆకునూరు కాంప్లెక్స్ హెచ్ఎం ఎం ఐలయ్య, పీఎస్ హెచ్ఎంలు ఎం.అయోధ్య, ఆంజనేయులు, పి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఉప్పల ప్రభాకర్, కృష్ణమూర్తి, రవీందర్, సంతోష్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, శ్యాంసుందర్, రాజయ్య, సమ్మ, శ్రావణ్‌కుమార్, నరేష్, రాధాబాయి, సీఆర్పీలు కనకరాజు, రజిని తదితరులు పాల్గొన్నారు.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి