Rainy Season | గుమ్మడిదల, జూన్8 : రోహిణీ కార్తెలోఒక వైపు ఎండలు, మరో వైపు అకాల వానలు కురిసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇక ఆదివారం మృగశిర కార్తె రావడంతో వానకాలం సీజన్ ప్రారంభమైంది. దీంతో రైతులు, ప్రజలు వానాకాలంకు స్వాగతం పలికారు. వేసవి కాలంలో కాసిన ఎండలు.. వానకాలంలో కురిసే వానలను సమన్వయం చేయడానికి పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ప్రజలు ఇంగువ బెల్లంను ఉండలుగా చేసుకుని మింగుతారు.
అంతే కాకుండా రెండు సీజన్ల వాతావరణాన్నితట్టుకోవడానికి చేపలు, చికెన్, వేడి పదార్థాలు తినడం వల్ల శరీరానికి వాతావణం తట్టుకోవడానికి సమన్వయం చేస్తాయని నమ్మకం ఉంది. దీంతో గుమ్మడిదల మండలంతోపాటు అన్ని గ్రామాల్లో చెరువులో చేపలను వేటాడి విక్రయిస్తున్నారు. కొర్రమీనులు కిలోకు రూ.800, తెల్ల చేపలు కిలో కు. రూ.200 విక్రయించారు. జనం అధికంగా చేపలను కొనుగోలు చేశారు. ప్రతి మార్కెట్లో చేపల విక్రయాల కేంద్రాల వద్ద జనం కొనుగోలు చేశారు.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్భవన్లో ప్రమాణస్వీకారం పూర్తి