Harish Rao | సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం బండచెర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి, మంత్రులు వెంటనే కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలను తెలుసుకోవాలన్నారు. మొక్కజొన్న (మక్కలు), సన్‌ఫ్లవర్, శనగలు విక్రయించిన రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా చెల్లింపులు అందలేదన్నారు.
మార్కెట్లలో ఇంకా సగం పైగా పంట నిల్వలు పేరుకుపోయి ఉన్నాయని, రైతులు 40 రోజుల నుండి ఎదురుచూస్తున్నారన్నారు. వరి ధాన్యం తరలించడానికి లారీల కొరత తీవ్రంగా ఉంది. RTA అధికారులు, వెహికల్ ఇన్స్పెక్టర్లు, పోలీసులను రంగంలోకి దించి, రోడ్లపై వెళ్లే ఖాళీ వాహనాలను మళ్లించి వెంటనే ధాన్యం తరలించాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు ధాన్యం దించుకోవడం లేదని, ప్రభుత్వం రైస్ మిల్ అసోసియేషన్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. ప్రతి రైస్ మిల్లు వద్ద ఒక సివిల్ సప్లై లేదా రెవెన్యూ అధికారిని నియమించి పర్యవేక్షించాలి . ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం మానేసి, ప్రశ్నించిన వారిపై తిరుగుదాడి చేయడం, కేసులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
వర్షాలు పడి పంట తడవకముందే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో మేం ఉన్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారులందరితో సమీక్షలు నిర్వహించి సమస్యలు లేకుండా చూశాం. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు వెళ్లిన లోడ్లను దించుకోవడం లేదు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా అస్తవ్యస్త పరిస్థితి నెలకొంది. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి కళ్లాల వద్దే నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఎరువులు, కరెంట్, సాగునీరు చివరకు పండించిన పంటను అమ్ముకోవడంలో కూడా రైతులకు ఈ ప్రభుత్వంలో తిప్పలు తప్పడం లేదన్నారు.
45 రోజుల్లో రైతుబంధు నిధులు పూర్తి చేస్తామని హామీ..
మార్చి 22న సిద్దిపేట సభలో రేవంత్ రెడ్డి 45 రోజుల్లో రైతుబంధు నిధులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 52 రోజులు దాటినా రైతులకు ఆ నిధులు అందలేదన్నారు హరీష్‌రావు. సిద్దిపేట మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులు గన్నీ సంచుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సంచులు ఇవ్వకపోవడంతో రైతులు బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. అటు ముఖ్యమంత్రికి, ఇటు మంత్రులకు ప్రజల సమస్యల పట్ల కనీస పట్టింపు లేదన్నారు.
సమస్యలను లోతుగా అర్థం చేసుకుని, వాటి పరిష్కారం కోసం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిద్ర లేవాలని, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఢిల్లీ చుట్టూ తిరగడం మానేసి, రైతుల కష్టాలను చూడాలని, వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తుమన్నామన్నారు.
సిద్దిపేట రూరల్ మండలం బండచెర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు ఆకస్మికంగా సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…
పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్… pic.twitter.com/6pYwOUxqOJ
— Office of Harish Rao (@HarishRaoOffice) May 12, 2026
బండి భగీరథ్‌పై పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు : అడ్వకేట్ లలితా రెడ్డి
KTR | విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం.. నీట్ రద్దుపై కేటీఆర్