Actor Vishal Praises CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంపై సినీ నటుడు విశాల్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రార్థన మందిరాలు, విద్యాసంస్థలు, ముఖ్యంగా పాఠశాలల సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు సీఎం విజయ్ ప్రకటించడంపై విశాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ నిర్ణయం ఎంతో మంది విద్యార్థినులకు, సామాన్య ప్రజలకు పెద్ద ఊరటనిస్తుందని ఆయన కొనియాడారు.
అలాగే విశాల్ తన పోస్ట్‌లో ఒక ఘటనపై ప్రస్తావిస్తూ.. ‘ఆర్.కె. నగర్లో నేను కలిసిన ఒక విద్యార్థిని, ప్రతిరోజూ స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు మద్యం షాపుల దగ్గర ఎదురయ్యే వేధింపుల గురించి, ఆ ఒత్తిడి గురించి ఫిర్యాదు చేసింది. ఆ అమ్మాయి లాంటి ఎంతో మంది విద్యార్థినులు, సామాన్యులు నేడు మీ నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి ముఖాల్లో మీరు చిరునవ్వు నింపారు’ అని విశాల్ పేర్కొన్నారు. పాఠశాలల సమీపంలో మద్యం షాపులను తొలగించడం వల్ల సమాజంలో ఒక పెద్ద సమస్య తొలగిపోతుందని, సీఎం విజయ్ మరియు ఆయన ప్రభుత్వాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని విశాల్ చెప్పుకోచ్చాడు.
Kudos to you ,whistles to u. Hats off to u. Dear CM josephvijay avargal. Thank u for the announcement to close 717 wine shops especially the ones near schools. Wat a move. So many girl children hav been facing harassment especially the one I know in rk nagar where a girl… pic.twitter.com/vYria0MIaB
— Vishal (@VishalKOfficial) May 12, 2026