Sunflower Crop | మండుటెండలో ధర్నా చేసినా ఫలితం లేకపాయె.. పొద్దుతిరుగుడు పంట తక్కువ ధరకు దళారుల చేతుల్లోకి..!
Sunflower Crop | వడ్లు, మక్కలు కొనుగోలు చేయడంటూ ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకున్నది లేదు. మండుటెండల్లో సైతం రోడ్డెక్కిన ఫలితం శూన్యం. ఇదే పరిస్థితి పొద్దు తిరుగుడు పండించిన రైతులకు కూడా ఎదురవుతోంది.
Sunflower Crop | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రైతన్నల పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతీ రోజు రాష్ట్రవ్యాప్తంగా పలు కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితులు కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వడ్లు, మక్కలు కొనుగోలు చేయడంటూ ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకున్నది లేదు. మండుటెండల్లో సైతం రోడ్డెక్కిన ఫలితం శూన్యం. ఇదే పరిస్థితి పొద్దు తిరుగుడు పండించిన రైతులకు కూడా ఎదురవుతోంది.
ఎండాకాలం నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి చేతికొచ్చిన పొద్దుతిరుగుడు ధాన్యంను ప్రభుత్వం నుంచి కొనే నాథుడే కరువైపోయాడు. దీంతో చేసేదేమి లేక అన్నదాతలు తమ పంటను తక్కువ ధరకు దళారులకు అమ్ముకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో అల్లిపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో దాదాపు 2 నెలల నుంచి కొనుగోళ్లు నిలిపివేశారు.
రైతన్నలు ఎదురుచూసి చూసి విసిగిపోయారు. ఎన్నిరోజులు ఎదురు చూసినా ఎన్నో సార్లు అధికారులకు, ప్రభుత్వనికి, ఆఖరికి మండుటెండల్లో రోడ్డు ఎక్కి ధర్నా చేసిన ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తక్కువ ధరకు పొద్దు తిరుగుడు పంటని దళారులకు అమ్ముకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. దళారుల చేతుల్లో రైతు ఫలితం
పొద్దు తిరుగుడు రైతు ఎదురు చూసి.. చుసి.. తన పంటను తక్కువ ధరకు దళారులకు అమ్ముకునేల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో అల్లిపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు… pic.twitter.com/c3HPmvVy0n
— Telugu Scribe (@TeluguScribe) May 20, 2026
Read Also :
US Tragedy | అమెరికాలో బాపట్ల టెక్కీ మృతి.. తల్లిదండ్రులు, తమ్ముడికి తీవ్ర గాయాలు
Hyderabad | వనస్తలిపురంలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య
Hyderabad | అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. సినిమా స్టైల్లో పోలీసుల చేజ్!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

