Hyderabad | అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. సినిమా స్టైల్లో పోలీసుల చేజ్!
Hyderabad | హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేపింది. మహీంద్రా థార్ కారులో వచ్చిన నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు..
Hyderabad | హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేపింది. మహీంద్రా థార్ కారులో వచ్చిన నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు మొదట యువతి జాయ్ ఆస్పత్రిలోకి పరిగెత్తింది. కానీ లాభం లేకుండాపోయింది. యువకులు ఆమెను పట్టుకుని బెదిరించి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు పోలీసులు కారును చేజ్ చేశారు. కానీ పోలీసుల కళ్లుగప్పి కిడ్నాపర్లు పారిపోయారు.
నిందితులు ఉపయోగించిన కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో వారిని పట్టుకోవడం సవాలుగా మారింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. కాగా, చేజింగ్ సమయంలో కారు వెనుకాలే మరో బైక్ కూడా ఫాలో అయినట్లుగా పోలీసులు గుర్తించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

