Farmers | రాయపోల్, ఆగస్టు 13 : కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తుంది. ఓ వైపు వర్షాలు పడుతుంటే మరోవైపు పంటలకు అవసరమ్యే యూరియా బస్తాల కోసం రైతులు ఎదురుచూస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. రైతులు తమ వ్యవసాయ పనులు వదులుకొని మరీ ఫర్టిలైజర్ షాపులు ఆగ్రోస్ కేంద్రల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. యూరియా కోసం రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఉదయం ఆగ్రోస్ సెంటర్లకు చేరుకొని రెండు బ్యాగుల యూరియా కోసం వ్యవసాయ పనులు వదులుకొని నానా తంటాలు పడుతూ యూరియా కోసం అరి గోస పడుతున్నారు. వ్యవసాయ అధికారులు ఒకవైపు యూరియా కొరత లేదని చెబుతున్నప్పటికీ.. మరోవైపు ఆగ్రో సెంటర్ల వద్ద రైతులు యూరియా కోసం క్యూ లైన్లో ఉండడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలిసిపోతుంది. పంటలకు అవసరం ఉన్నప్పుడు యూరియాను సరఫరా చేయాలని వివిధ గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు రైతులు వేసిన పంటల అంచనాలకు అనుగుణంగా యూరియాను అందుబాటులో ఉంచితే తమకు ఈ కష్టాలు వచ్చేవి కావని రైతులు వాపోతున్నారు. రెండు బ్యాగుల యూరియా తీసుకుంటే కచ్చితంగా నానో యూరియాను తీసుకోవాలని కరాకండిగా చెప్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నానో ఏరియా వాడకంపై అవగాహన లేని రైతులు దిక్కుతోచని స్థితిలో కొనుగోలు చేసి తీసుకుంటున్నారు. ఇప్పటికైనా రైతులకు అవసరపడే యూరియాను సరఫరా చేయాలని రైతులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక చాలా గ్రామాల రైతులు యూరియా దొరకకపోవడంతో నిరాశతో వారి గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారు. యూరియా దొరకని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు రోజులు పడిగాపులు కాసినా ప్రయోజనం లేకుండా పోయిందని పలు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియాను అందించాలని మండలంలోని ఆ గ్రామాలకు చెందిన రైతులు పేర్కొంటున్నారు.
Heavy Rains | అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సై కీలక ఆదేశాలు
Road Repair | ఆదమరిస్తే అంతే.. సారూ ఈ రోడ్లకు జర మరమ్మతులు చేయించండి
గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు అవస్థలు