Purchase Centres | సిద్ధిపేట అర్బన్, ఏప్రిల్ 9 : రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మిట్టపల్లి పీఏసీఎస్ చైర్మన్ చింతల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ మిట్టపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. అదే విధంగా మండల పరిధిలోని తడ్కపల్లి, కిష్టసాగర్, పొన్నాల, బక్రి చెప్యాల, నాంచారుపల్లి గ్రామాల్లో సిద్దిపేట పీఏసీఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ దుర్గారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పయ్యావుల రాములు, చింతల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ