Grain Purchase Centres | రాయపోల్, ఏప్రిల్ 14 : రాయపోల్ మండలం మంతూరు గ్రామంలో ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ ఏపీఎం కిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యాన్ని ఆరబోసి చెత్తా చెదారం లేకుండా తీసుకురావాలని పేర్కొన్నారు. సన్న రకం వడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 ప్రభుత్వం బోనస్‌గా ఇస్తుందని పేర్కొన్నారు.
అన్ని గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వడ్లను కూడా కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దళారుల మాయమాటలు నమ్మి మోసపోకుండా రైతులు పండించిన వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు.
వరి ధాన్యం తూకం వేసిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మాషుల్ ఆలి, వీఓఏ నరేందర్‌రెడ్డి, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.