India condolences : ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతికి భారత్ (India) సంతాపం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri).. భారత్ తరఫున సంతాప సందేశాన్ని రాశారు. అనంతరం ఇరాన్ రాయబారితో మిస్రీ మాట్లాడారు. ప్రస్తుతం ఇరాన్లో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు.
ఇటీవల ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు దాడిచేసి ఆ దేశపు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చాయి. దాంతో పొరుగు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్ధరిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రపంచదేశాలకు చమురు సరఫరాలో జీవనాడి లాంటి హార్ముజ్ జలసంధిని మూసివేసింది.