Farmers | మిరుదొడ్డి, జూలై 7 : ఇప్పటికే నెల రోజులపాటు వానాకాలం సీజన్లో వానలు కురువకపోవడంతో రైతులు పునాస పంటలు వేయకుండా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. బోరు బావుల వద్ద డ్రిప్పు పైపులకు వేసిన, అడపాదడపా అక్కడక్కడా కురిసే వర్షాలకు వేసిన మొక్కజొన్న పంటలకు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో యూరియా వేయాలకున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇటు మొక్కజొన్న పంటలకు, అటూ వరి పంటలకు యూరియాను వేయాలనుకున్న అన్నదాతలకు యూరియా దొరకడం లేదు.
సోమవారం మిరుదొడ్డి మండల చెప్యాల-అల్వాల క్రాస్ రోడ్డులోని శ్రీ లక్షీ నర్సింహా రైతు సేవా కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం క్యూ లైన్ కట్టినా లాభం లేకుండా పోయింది. రైతులు దుకాణం యజమానులను నిలదీస్తే మమ్మల్ని ఏమి చేయమంటారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న యూరియాను మీకు అందజేస్తున్నాము. అక్కడి నుంచే సరఫరా తక్కువగా ఉందని సమాధానం ఇస్తున్నారు. ఆధార్ కార్డు ఉన్న రైతులకు మాత్రం ఒక్కొక్కరికీ రెండు యూరియా సంచులను ఇవ్వడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు.
ఈ సందర్బంగా ఆయా గ్రామాల రైతులు మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా యూరియా రైతులకు ఎంత కావాలంటే అంతగా దొరికేది. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా కోసం గోసలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి రైతు సేవా ఆగ్రోస్ కేంద్రాల వద్ద రైతులు క్యూ లైన్లు కట్టే పరిస్థితులు నేడు దాపురించాయని తమ బాధలను వ్యక్తం చేశారు. రైతులకు యూరియా సరిపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కొందరికే యూరియా బస్తాలు దొరకడంతో మిగిలిన రైతన్నలు చేసేదేమి లేక వారి గ్రామాలకు వెను దిరిగి ఇంటికి వెళ్లిపోయారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు