Velugumatla Victims | మేమేదో పాకిస్తాన్ టెర్రరిస్టులలాగా మా కాలనీని చుట్టుముట్టేశారు.. వెలుగుమట్ల బాధితురాలి ఆవేదన
velugumatla Victims | కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా పేదలను వారి ఇళ్లలో నుంచి బలవంతంగా ఖాళీ చేయించి ఇళ్లను కూల్చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూదాన్ భూముల్లో ఇండ్లను కోల్పోయిన పేదలు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసుల అత్యుత్సాహం ఎలా ఉందో ఓ బాధిత మహిళ చెప్పుకొచ్చింది.
Velugumatla Victims | ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులు కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.అప్పులు చేసి, బంగారాలు అమ్ముకుని ఎంతో కష్టపడి కట్టుకున్నఇళ్లను రేవంత్ సర్కార్ బుల్డోజర్లతో నేలమట్టం చేయడంపై కన్నీరుమున్నీరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం లేకుండా పేదలను వారి ఇళ్లలో నుంచి బలవంతంగా ఖాళీ చేయించి ఇళ్లను కూల్చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూదాన్ భూముల్లో ఇండ్లను కోల్పోయిన పేదలు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసుల అత్యుత్సాహం ఎలా ఉందో ఓ బాధిత మహిళ చెప్పుకొచ్చింది.
ప్రెస్ మీట్లో బాధిత మహిళ మాట్లాడుతూ.. ఉదయం 4 గంటలకే వచ్చి కాలనీ చుట్టుముట్టేశారు. ఏదో దొంగల్లాగా.. మేమేదో పాకిస్తాన్ టెర్రరిస్టులలాగా చుట్టుముట్టేశారు. ఇదేంటి ఇంత జనం వచ్చారు. ఎప్పుడు లేదే..ఈ జనాలను చూసి చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. కూల్చేస్తున్నారు. కనీసం అక్కడున్న వస్తువులు కానీ, బట్టలు తీసుకోవడానికి కానీ అవకాశం లేదు. ఏందయ్యా అంటే మీరెవరు మాట్లాడొద్దన్నారని చెప్పింది. ఒక్క ఇంటికి ఐదుగురు మున్సిపాలిటీవాళ్లు, ఆరుగురు పోలీసులు కాపాలా కాసి ఎలా చేస్తున్నారంటే.. మీరు లోపలికి వెళ్లొద్దు.. ఏ సామాను కూడా ముట్టుకోవద్దు.. మీకే అధికారం లేదు అన్నట్టు దౌర్జన్యంగా వ్యవహరించారు.. బట్టలు తీసుకోవడానికి కానీ.. కనీసం అక్కడున్న ఆహారాన్ని తీసుకోనివ్వలేదు. కనీసం మేం కొనుక్కోని తెచ్చుకుని అక్కడే ఉన్న బియ్యం, నూనె, ఉప్పులు, పప్పులు కూడా తీసుకునే అవకాశమివ్వకుండా దారుణంగా కూల్చేశారు.
మేమేం ప్రభుత్వ భూముల్లో లేమే..మేం పేదల కోసం ఇచ్చిన భూదాన్ భూమిలోనే ఉన్నాం. అది మా భూమి. మేం ఉండే హక్కు మాకుంది. మేం పేదోళ్లం కామని వాళ్లెట్లా చెప్తరు. కలెక్టర్ ఏ రోజన్నా వచ్చి సర్వే చేసినరా.. కలెక్టర్ కిటికీలో నుంచి ఇలా చూస్తే మా కాలనీ కనిపిస్తది. ఏ రోజైనా వచ్చి వీళ్లు నిజమైన పేదోళ్ల అని చూశారా..? అని ప్రశ్నించింది. మేం పేదవాళ్లం కాదని ఎలా చెప్పగలుగుతాడు. మీకు వేరే దగ్గర ప్లేసులిస్తాం.. ఇంటి స్థలాలిస్తాం.. అక్కడెళ్లి ఉండండి.. అని ఇప్పుడు మంత్రులు అంటున్నారు. నిజమైన పేదోళ్లకు ఇండ్ల స్థలాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నరు. మాకు ఎక్కడా అవసరం లేదు. మీ భూమి ఇవ్వొద్దు. మీ ఇండ్లల్లో ఇవ్వొద్దు. మా భూదాన్ భూముల్లోనే మా ఇంటి స్థలం కూలగొట్టిన దగ్గరే మాకు ఇల్లు కట్టి మాకు నష్టపరిహారం ఇస్తే చాలు.. మేం కోరుకునేది అదొక్కటే.. మా డిమాండ్ ఇదేనంటూ బాధిత మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మేము ఏదో పాకిస్తాన్ టెర్రరిస్టులు అన్నట్లు వ్యవహరించారు
ఉదయం 4 గంటలకు వచ్చి మా కాలనీ చుట్టుముట్టారు, ఒక్కో ఇంటి దగ్గర 10 మంది అధికారులు నిలబడ్డారు
కనీసం మా బట్టలు, మా పిల్లల పుస్తకాలు కూడా తీసుకునివ్వలేదు
ఇప్పుడు మేము పేదవాళ్లు కాదని అంటున్నారు, ఏనాడైనా వచ్చి మా గురించి… https://t.co/2gSr7vtqvE pic.twitter.com/GGIYR6eQnA
— Telugu Scribe (@TeluguScribe) March 10, 2026
Read Also :
Bhadradri Kothagudem : కత్తి పట్టిన కలెక్టర్
ఏరియా వర్క్ షాప్‌లో సిపిఆర్, అగ్నిమాపక యంత్రాల వినియోగంపై అవగాహన
‘గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలి’
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

