మద్దూరు(ధూళిమిట్ట), మార్చి31 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఓ వైపు సాగునీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ కష్టాలిలా ఉంటే మరోవైపు ప్రభుత్వం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం దళారుల చేతిలోకి పోతుంది.
తీవ్ర నీటి ఎద్దడితో అరకొరగా ఉన్న సాగునీటితో కష్టనష్టాలను ఓర్చుకొని పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు చేసేదేమిలేక మధ్యదళారులు, మిల్లర్లకు నామమాత్రపు ధరలకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. కొంతమంది రైతులు అకాల వర్షాల భయానికి ముందస్తుగా వరిని కోస్తున్నారు. ఇదే అదనుగా భావించి మిల్లర్లు తేమ శాతం పేరిట ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 2320 మద్దతు ధరను నిర్ణయించగా.. మధ్య దళారులు, కొంతమంది మిల్లర్లు రూ. 1500 నుంచి 1800 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర అందే విధంగా చూడాలని రైతాంగం డిమాండ్ చేస్తుంది.
AP News | వారం రోజుల నుంచి గుడి ముందు నగ్నంగా పూజలు.. ఉగాది రోజు సజీవ సమాధికి యత్నం!
Jagadish Reddy | ఆ భాషే ఆయన్ను బొందపెడుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ధ్వజం