Kabul attack | మారణహోమాన్ని యుద్దంలా చిత్రీకరిస్తారా.. ఆఫ్ఘన్‌పై పాక్ దాడి చేయడంపై ఇండియా ఆగ్రహం
Kabul attack : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఆస్పత్రిపై పాక్ జరిపిన దాడి ప్రపంచాన్ని షాక్‌కు గురి చేస్తోంది. యుద్ధ రీతిని పక్కనబెట్టి ఒక ఆస్పత్రిపై పాక్ జరిపిన వైమానిక దాడిలో 400 మంది మరణించారు.
Kabul attack : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఆస్పత్రిపై పాక్ జరిపిన దాడి ప్రపంచాన్ని షాక్‌కు గురి చేస్తోంది. యుద్ధ రీతిని పక్కనబెట్టి ఒక ఆస్పత్రిపై పాక్ జరిపిన వైమానిక దాడిలో 400 మంది మరణించారు. మరో 300 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆఫ్ఘన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఇండియా కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని పాక్ చేసిన క్రూరమైన మారణహోమంగా అభివర్ణించింది.
ఆఫ్ఘన్‌పై దాడిపై భారత కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఈ దాడి ఎంతమాత్రం యుద్ధ చర్య అనిపించుకోదని, ఈ మారణహోమాన్ని పాక్ ఒక ఆర్మీ ఆపరేషన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లోని ఒక డ్రగ్స్ చికిత్స కేంద్రంపై పాక్ సోమవారం రాత్రి దాడి చేసింది. ఈ దాడిలో 400 మంది మరణించగా, 300 మందికిపైగా గాయపడ్డారు. ఇలా ఆస్పత్రిపై దాడి చేయడం అంతర్జాతీయ యుద్ధ చట్టాలకు వ్యతిరేకం. దీనిపై ఆఫ్ఘన్ సహా అనేక దేశాల పాకిస్తాన్‌ను విమర్శిస్తున్నాయి. ఇండియా కూడా ఘాటుగా స్పందించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన చర్యను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. ఇది కావాలని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిగా వర్ణించింది. తాము ఆయుధ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు తెలిపింది.
తమ దేశంలో దాడులు చేస్తున్న తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) అనే తీవ్రవాద సంస్థకు ఆఫ్ఘన్ స్వర్గధామంగా మారిందని, అందువల్లే ఆ సంస్థపై దాడులు చేస్తున్నామని పాక్ చెబుతోంది. అయితే, దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఇండియా ఈ దాడిని క్రూరమైన, దురాక్రమణ చర్యగా అభివర్ణించింది. ఇది ఆఫ్ఘన్ సార్వభౌమధికారంపై జరిగిన దాడి అని, ఇలాంటి దాడుల వల్ల ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం దెబ్బతింటాయని భారత్ వ్యాఖ్యానించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

