Hrithik Roshan | హృతిక్ రోషన్ కొత్త సాహసం.. సోదరుడు ఈషాన్తో కలిసి క్రేజీ కామెడీ మూవీ!
Mess Movie | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన సోదరుడు ఈషాన్ రోషన్‌తో కలిసి సినీ నిర్మాణ రంగంలో సరికొత్త అడుగులు వేస్తున్నాడు.
Mess Movie | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన సోదరుడు ఈషాన్ రోషన్‌తో కలిసి సినీ నిర్మాణ రంగంలో సరికొత్త అడుగులు వేస్తున్నాడు. వీరిద్దరి కలయికలో ‘మెస్’ (Mess) అనే క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ రాబోతుండగా.. హృతిక్ రోషన్ తన సొంత బ్యానర్ ‘HRX ఫిలిమ్స్’ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈషాన్ రోషన్ ఈ ప్రాజెక్టులో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే . ఒక దొంగల ముఠా ఒక ఇంట్లోకి చోరీ కోసం ప్రవేశించగా, ఆ ఇంటి యజమాని OCDతో బాధపడుతుంటాడు. అయితే ఇంటి యజమాని పెట్టే తిప్పలకు దొంగలు ఎలా ఇబ్బంది పడ్డారు, అక్కడి నుంచి వారు ఎలా తప్పించుకున్నారనే అంశాలతో దర్శకుడు రాజేష్ కృష్ణన్ పూర్తిస్థాయి కామెడీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాజేష్ కృష్ణన్ గతంలో ‘లూట్కేస్’, ‘క్రూ’ వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నాడు.
మరోవైపు హృతిక్ రోషన్ తన సోదరుడిని నిర్మాతగా పరిచయం చేస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఈ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించడం ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. వీరు ఇప్పటికే ప్రైమ్ వీడియోతో కలిసి ‘స్టార్మ్’ అనే వెబ్ సిరీస్‌ను కూడా ప్రకటించారు. నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల కానున్న ఈ ‘మెస్’ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటుల వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

