SI Manasa | రాయపోల్, నవంబర్ 22 : ప్రజలు ప్రతి ఒక్కరు వారి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాయపోల్ ఎస్ఐ మానస అన్నారు. శనివారం ఎస్ఐ మానస సిద్దిపేట సీపీ ఆదేశాల మేరకు పరిశుభ్రత పచ్చదనంలో భాగంగా పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మానస మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వారి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
పరిసరాల పరిశుభ్రత అందరూ పాటించాలని.. ఇంటి ఆవరణ చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కనకయ్య, సిబ్బంది స్వామి, వికాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Dharmaram | ధర్మారం అయ్యప్ప స్వామి ఆలయంలో భిక్షా కార్యక్రమం ప్రారంభం
Smog | కుభీర్ను కమ్మేసిన పొగ మంచు.. ఇబ్బందుల్లో గ్రామస్థులు
Local Body Elections | స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం