MLA Kotha prabhakar reddy | తొగుట, ఆగస్టు 4 : 78 ఏళ్ల స్వాతంత్ర భారతంలో నేటికీ విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారిందని, విద్య, వైద్యాన్ని జాతీయీకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తొగుట మండలం ఘన్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ మనుమలు, మనుమరాలు ఎండీ కరీమోద్దీన్, యాసీనుద్దీన్ అయేషా సుల్తానాలు తమ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు బ్యాగులు సమకూర్చగా.. ఆయనతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి రాకముందే కేపీఆర్ ట్రస్ట్ ద్వారా పాఠశాలల్లో పుస్తకాలు, బ్యాగులు అందించడం జరిగిందని గుర్తు చేశారు. నేడు ప్రతి ఒక్కరి సంపాదనలో సింహభాగం విద్య, ఆరోగ్యానికి కేటాయిస్తున్నా.. నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా విద్య, ఆరోగ్య వ్యవస్థలో మార్పు రావడం లేదన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా అదే ధోరణి కనిపిస్తుంది. ఘనపూర్‌లో 10 మందికి పైగా టీచర్లు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ప్రభుత్వ టీచర్లు కానీ.. వారే ప్రయివేటు పాఠశాలల్లో పనిచేస్తున్న విషయాన్ని గుర్తించుకోవాలని ప్రజలను కోరారు.. ప్రభుత్వం కూడా ప్రైవేట్ కు ధీటుగా పాఠశాలలను తీర్చిదిద్దాలి.. రాజకీయాలు పక్కన పెట్టి భావి భారత సమాజం కోసం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కృషి..
విద్య, వైద్యం వ్యాపారంగా మారిందని వాటిని జాతీయీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో ఎవరికి వారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ మాట్లాడుతూ.. జన్మదిన వేడుకల ఖర్చును ఇలా పేద విద్యార్థుల సహాయం కోసం మా మనుమలు, మనుమరాళ్లు ఖర్చు చేయడం సంతోషంగా ఉండన్నారు.. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు అంజలి ఎమ్మెల్యేతోపాటు ముఖ్య అతిధులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, దుబ్బాక పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణా గౌడ్, నాయకులు సికిందర్, చిలువేరి మల్లారెడ్డి, బోధనం కనకయ్య, కొమ్ము శరత్, కలీమోద్దీన్, వేల్పుల స్వామి, శేఖర్ గౌడ్, మంగ నర్సింలు, ఎల్లం, రాజిరెడ్డి, రాజశేఖర్, కిరణ్ కుమార్ రెడ్డి, నరేందర్ గౌడ్, రమేష్, అక్కం స్వామి,భైరాగౌడ్, అశోక్,దుబ్బాక కనకయ్య, వెంకటేష్, ప్రభాకర్ రెడ్డి, రాజిరెడ్డి, యాదగిరి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Kantara 3 | కాంతార 3లో జూనియర్ ఎన్టీఆర్… ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కి పూనకాలే..!
Kamal Hassan | సనాతన బానిసత్వాన్ని అంతంచేసే ఆయుధం అదొక్కటే.. కమల్ హాసన్
Film Chamber | లేబర్ కమిషనర్‌ను కలవనున్న ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యులు