Film Chamber | తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలంటూ బంద్‌కు పిలుపునిచ్చాయని తెలిసిందే. వర్కర్ల ప్రధాన డిమాండ్ వేతనాలను 30 శాతం మేర పెంచాలని.. ఈ మేరకు ఫెడరేషన్ ప్రతినిధులు ఫిలిం ఛాంబర్‌తో చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు అనుకూల ఫలితాలు ఇవ్వకపోవడంతో నిరసనగా బంద్ ప్రకటించారు.
ఫెడరేషన్ బంద్ నేపథ్యంలో చాలా వరకు షూటింగ్స్ నిలిచిపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డిమాండ్లపై ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలి అత్యవసరంగా సమావేశమైంది. అయితే ఈ సమావేశంలో కార్మికులకు 30 శాతం వేతనాల పెంపుపై నిర్మాతల మండలి ఎటూ తేల్చలేకపోవడంతో ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యులు సాయంత్రం 4 గంటలకు లేబర్ కమిషనర్‌ను కలవనున్నట్టు తెలుస్తోంది.
అత్యవసరం సమావేశానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రీ రవి, సురేశ్ బాబు, శివలెంక కృష్ణ ప్రసాద్, రాధామోన్. ఠాగూర్ మధు, బాపినీడు, ఫెడరేషన్ సభ్యులు, ఫిలించాంబర్ సభ్యులు హాజరయ్యారు.
షూటింగ్‌లపై బంద్ ప్రభావం కొనసాగితే, సినిమాల విడుదల తేదీల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా? లేదంటూ ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.
Kantara 3 | కాంతార 3లో జూనియర్ ఎన్టీఆర్… ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కి పూనకాలే..!
Kamal Hassan | సనాతన బానిసత్వాన్ని అంతంచేసే ఆయుధం అదొక్కటే.. కమల్ హాసన్