DR Br Ambedkar birth anniversary | రాయపోల్, ఏప్రిల్ 14 : బడుగు, బలహీన వర్గాల కోసం యుద్ధం చేసిన ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, అంటరాని తనం, కులవివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశను చూపిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు సిద్ధిపేట జిల్లాలో ఘనంగా జరిగాయి.
రాయపోల్ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆ మహానీయుడు చేసిన పోరాట పటిమను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అయ్యగల్ల రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుర్ర నర్సింలు, మండల ఉపాధ్యక్షుడు బందారం సంతోష్, మండల ప్రధాన కార్యదర్శి మల్లేశం, టెంకంపేట నర్సింలు, కోశాధికారి కొన్నింటి లక్ష్మణ్, సెక్రెటరీ శివకుమార్, వివిధ సంఘాల నాయకుడు జోగు ఎల్లయ్య, తుడుం ప్రకాష్, ఉషనగల్ల ఎల్లం, గుని చంద్రం, మల్లగల్ల సాయిలు, తుడుం నరసింగరావు, తుడుం స్వామి, నర్సయ్య,శేఖర్, కూచిగారి రాములు,బండ్ల స్వామి,అయ్యగల్ల రవి తదితరులు పాల్గొన్నారు.
స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ : తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి
తొగుట: అక్షరమే ఆయుధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యా కుసుమం.. అసమానతలు, అంటరానితనం నిర్మూలనకై అహర్నిశలు పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త.. విభిన్న సంస్కృతుల భారత దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు విశేష కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రధాత అని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుci జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.
అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వెంకట్రావుపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. తరతరాల భవిష్యత్తుకై రాజ్యాంగం ద్వారా బలమైన పునాది వేసిన అంబేద్కర్ స్పూర్తితో కేసీఆర్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రగతి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ దళిత బాంధవుడిగా నిలిచారని తెలిపారు.
అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగానే దళితబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దేశానికి స్ఫూర్తి గా నిలిపిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు. కాంట్రాక్టు పనుల్లో, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందన్నారు.
సచివాలయంకు అంబేద్కర్ నామకరణం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు డబ్బికారి పెంటోజీ, పులిగారి గణేష్, ఈదుగాళ్ల పర్శరాములు, బండారు స్వామి గౌడ్, సుతారి రాములు, సిరిసిల్లా రాజేశం, పాత్కుల బాలేష్, పులిగారి లక్ష్మణ్, పిట్ల వెంకటేష్, లింగం, చాకలి బాలయ్య, అజాం, వడ్డె నందు, అర్జున్, మల్లేశం, భాస్కర్, జహంగీర్, కనకయ్య, నాగరాజు, లక్ష్మణ్, నరేష్, రాంబాబు, శ్రీనివాస్, నరేష్, ఆంజనేయులు, వడ్డె మల్లేశం, కల్లెపు సుధాకర్, స్వామి, చంద్రం తదితరులు పాల్గొన్నారు.