Talasani Srinivas Yadav | ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటలకు మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కొమురవెల్లి ఆలయ అభివృద్ధి జరిగిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధితో కొమురవెల్లిలో వేలల్లో ఉన్న భక్తుల సంఖ్య లక్షలకు చేరిందని..నాటి మంత్రి హరీష్ రావు పర్యవేక్షణలో భక్తుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. భక్తుల వసతి కోసం 50 కాటేజీల నిర్మాణం చేపట్టామన్నారు. ఏడాదికి ఆలయ వార్షిక ఆదాయం 50 లక్షలు ఉంటే ఇప్పుడు 20 కోట్లకు పెరిగిందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఎలాంటి అభివృద్ధి లేదు.రైల్వే స్టేషన్ ప్రారంభమైనా రైళ్లు ఆగడం లేదు.. రైళ్లు ఆపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆలయానికి భక్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికే ఖర్చు చేయాలన్నారు.
Medak | మెదక్ జిల్లాలో దారుణం..భార్యను గొంతు కోసి హతమార్చి, నగలతో పరారైన భర్త
Modugapoolu | మోదుగు పువ్వులు విరబూస్తూ.. బాటసారులకు కనువిందు చేస్తూ
Rtc bus | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు