Cyber Crime | మద్దూరు (ధూళిమిట్ట), మార్చి 27: సైబర్ మోసగాళ్ల బారిన పడి మోసపోతున్న ఘటనలు ప్రతీ రోజూ ఏదో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
మేము పోలీసులం మాట్లాడుతున్నాం. నీపైన ఓ కేసు నమోదైంది. కేసును తీసివేయాలంటే వెంటనే ఈ ఫోన్ నెంబర్‌కు డబ్బులు పంపుమని సైబర్ మోసగాడు ఓ వలస కూలీకి ఫోన్ చేసి డబ్బులు కాజేశాడు. నర్సాయపల్లి గ్రామానికి చెందిన కుమార్ అనే మేస్త్రీ వద్ద మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు కూలీలు పనిచేస్తున్నారు. నలుగురు కూలీలలో ఒకరైన వినోద్‌కు గురువారం ఉదయం 9685695940 ఫోన్ నెంబర్‌తో ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను పోలీస్‌ను మాట్లాడుతున్నానని, నీ పైన కేసు నమోదైనట్లు తెలిపాడు.
ఈ కేసును తీసివేయాలంటే వెంటనే నెంబర్‌కు రూ. 50వేలు పంపాలని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన వినోద్ తన ఫోన్లో నుంచి పేటీఎం ద్వారా రూ.26 వేలు పంపించాడు. ఈ విషయాన్ని తన స్నేహితులకు తెలుపగా వారు సదరు నెంబర్‌కు కాల్ చేయడంతో ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!