TG Weather | తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఇటీవల ద్రోణి కారణంగా రెండుమూడురోజులు వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాబోయే నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. నిన్న ఉమ్మడి నిజామాబాద్ అధికంగా 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో పొడి వాతవరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు పెరుగుతుండడంతో జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఎండలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.