Missing Case | రామాయంపేట, జూలై 05 : దంపతులు, ఓ చిన్నారి అదృశ్యమైన సంఘటన రామాయంపేట మండలంలోని రాయిలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రాయిలాపూర్ గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ అతని భార్య ప్రియ గత కొన్ని రోజులుగా కుటుంబ విషయంలో గొడవలు జరుతున్నట్లు రామాయంపేట పోలీసులు తెలిపారు.
ప్రేమ్‌కుమార్ ఉద్యోగ రీత్యా ప్రతిరోజు చేగుంటకు వెళ్తాడు. భర్త వెళ్లడం చూసిన అతడి భార్య ప్రియ తన మూడు సంవత్సరాల కూతురిని వెంట తీసుకుని శుక్రవారం ఇంట్లో నుండి వెళ్లినట్లు తెలిపారు. వారితోపాటు ప్రేమ్‌కుమార్ కూడా ఉద్యోగం చేసి ఇంటికి రాకుండా అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురి ఆచూకీ కోసం ప్రేమ్‌కుమార్ తండ్రి తిరుమలయ్య వారి కుటుంబీకుల వద్ద.. కోడలు తల్లి ఇంటికి కూడా వాకబు చేయడంతో ఎక్కడ కూడా ఆచూకి లభించనట్లు తెలిపారు. ఈ విషయమై అదృశ్యమైన ప్రేమ్‌కుమార్ తండ్రి రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు