Car Accident | జనగామ : జనగామ జిల్లా లింగాపురం మండలం వడిచెల్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఎస్ఐ బండి శ్రావణ్ కుమార్ కథనం ప్రకారం.. ఏపీకి చెందిన నెల్లూరు జిల్లా మణుగూరు మండలం వడ్లపూడికి చెందిన దడ్డోజు సురేష్ కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
సురేష్ తన భార్య దివ్య, కూతురు మోక్షంజు, కుమారుడు లోక్సన్తో కలిసి మహేంద్ర బొలెరో కారులో గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం సురేష్ తన ఫ్యామిలీతో కలిసి కారులో కరీంనగర్‌కు బయలుదేరాడు. ముందటి సీట్లో భార్యాభర్తలు కూర్చోగా.. వెనక సీట్లో కూతురు, కుమారుడు కూర్చున్నారు. మండలంలోని వడిచెర్ల సమీపంలో కారు అదుపుతప్పి పక్కన ఉన్న కల్వర్టుకు ఢీ కొట్టింది.
ఈ సంఘటనలో ముందు సీట్లో కూర్చున్న సురేష్, దివ్య అక్కడికక్కడే మృతిచెందగా.. వెనక సీట్లో కూర్చున్న కూతురు, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు చిన్నారులకు కుటుంబ పెద్దలు లేకుండాపోవడంతోపాటు పెళ్లిరోజే దంపతులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పలువురిని కంటతడి పెట్టించింది. కండ్ల ముందే అమ్మానాన్నలను కోల్పోవడంతో చిన్నారుల రోదనలు మిన్నంటాయి.
Constitution Amendment Bill: పోలీసు రాజ్యంగా మారుస్తున్నారు : విపక్షాల ఆరోపణ
Rajapeta : రాజాపేట చెరువుల్లోకి చుక్కనీరు రాలే
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని రైతుల ధర్నా