ASI krishnam raju | రాయపోల్, డిసెంబర్ 31 : వృత్తి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన సిద్ధిపేట జిల్లా రాయపోల్ ఏఎస్ఐ కృష్ణంరాజు పదవి విరమణ చేయడం బాధాకరమని.. ప్రభుత్వ ఉద్యోగులకు విరమణ వీడ్కోలు తప్పదని తొగుట సీఐ షేక్ లతీఫ్ అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో జీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమంలో ఏఎస్ఐ కృష్ణంరాజును రాయపోల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సీఐ లతీఫ్ మాట్లాడుతూ.. కృష్ణంరాజు కానిస్టేబుల్ నుంచి గత 35 సంవత్సరాలుగా విధులు సక్రమంగా నిర్వహించి ఏఎస్ఐ వరకు బాధ్యతలు స్వీకరించి వృత్తి బాధ్యతలను మంచిగా నిర్వహించి ఎవరి మనసు నొప్పించకుండా ఆయన విధులను సమయపాలన పాటిస్తూ మంచిగా ఉద్యోగ బాధ్యతలను చేపట్టి నేడు పదవీ విరమణ పొందుతున్నకృష్ణంరాజు సేవలు మరువలేనివని పేర్కొన్నారు.
గత 35 సంవత్సరాల నుంచి పోలీస్ ఉద్యోగంలో చెరి అంచెలంచెలుగా కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ఎదిగి అనేక ఉత్తమ అవార్డులు తీసుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. కృష్ణంరాజు పదవీ విరమణ తర్వాత ఆయన అనుభవాలతో ప్రజలకు సేవలు అందించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్ఐ మానస, ఏఎస్ఐ దేవయ్య.
హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి. కనకయ్య. కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.
Warangal | రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
Farmer died | వరినాట్లు వేసేందుకు వెళ్తూ.. పొలంలో పడి రైతు మృతి