ఖిలావరంగల్, డిసెంబర్ 31: గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని(Train) మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున వరంగల్-చింతలపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. వివరాల్లోకి వెళితే, వరంగల్ జీఅర్పీ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం. సుమారు (45) ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి అబ్బని కుంట మైసమ్మ దేవాలయం సమీపంలో గుర్తుతెలియని రైలు ఢీ కొట్టింది.
మృతుడు బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ జీన్స్ ప్యాంట్, వైట్ కలర్ ఫుల్ షర్ట్ ధరించి ఉన్నాడు. మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదు. రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ మార్చురీ గదిలో భద్రపరిచి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు ఎంజీఎం దవాఖానా మార్చురీలో గాని లేదా వరంగల్ ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.