Tara Sutaria | బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన తారా సుతారియా – వీర్ పహారియా ప్రేమాయణం మరోసారి సోషల్ మీడియా సెంటర్ స్టేజ్‌కి వచ్చింది. గత కొన్ని నెలలుగా ఈ జంటకు సంబంధించిన పబ్లిక్ అప్పియరెన్సులు, విదేశీ విహారయాత్రల ఫోటోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ముంబైలో జరిగిన ఓ మ్యూజిక్ కచేరీ సందర్భంగా జరిగిన ఘటన ఈ జంట మధ్య వివాదాలు ఉన్నాయన్న ఊహాగానాలకు దారి తీసింది. ప్రముఖ పాప్ సింగర్ ఏపీ థిల్లాన్ ముంబైలో నిర్వహించిన కచేరీలో వేదికపై తారా సుతారియాతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ సందర్భంగా ఏపీ థిల్లాన్ అకస్మాత్తుగా తారా చెంపపై ముద్దు పెట్టుకున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే వీడియోలో వేదిక దిగువన ఉన్న వీర్ పహారియా ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపించిందంటూ నెటిజన్లు విశ్లేషణలు మొదలుపెట్టారు.
ఈ సన్నివేశం తారా- వీర్ మధ్య దూరం పెరిగిందా? ప్రేమ పక్షులకు మధ్య సమస్యలున్నాయా? అనే ప్రశ్నలకు తెరలేపింది. కొందరు నెటిజన్లు ఇది ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసిన వీడియో అంటూ ఆరోపణలు కూడా చేశారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తారా సుతారియా స్వయంగా ముందుకు వచ్చారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కచేరీకి సంబంధించిన పూర్తి వీడియోను షేర్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “తప్పుదారి పట్టించే కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఇది తెలివైన ఎడిటింగ్ మాత్రమే. ఏపీ థిల్లాన్ నా ఫేవరెట్ ఆర్టిస్ట్. ముంబైలో అది ఒక అద్భుతమైన రాత్రి. మా పాటపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. తప్పుడు కథనాలు నమ్మొద్దు. పీఆర్ ప్రచారాలు మమ్మల్ని కదిలించవు. చివరికి ప్రేమ ఎల్లప్పుడూ గెలుస్తుంది.” అని తారా స్పష్టం చేశారు.
వీర్ పహారియా కూడా ఈ అంశంపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. వైరల్ అయిన వీడియోపై స్పందిస్తూ…అది నిజమైన వీడియో కాదు. నా రియాక్షన్ ఫుటేజ్ మరో పాట సమయంలో తీసింది. ఇది పూర్తిగా చెత్త ప్రయత్నం. జోకర్స్ అంటూ తీవ్రంగా మండిపడ్డాడు. వీడియోను ఉద్దేశపూర్వకంగా తప్పుగా ఎడిట్ చేసి తమను టార్గెట్ చేశారని వీర్ వ్యాఖ్యానించాడు. ఈ ఘటన తర్వాత తారా–వీర్ జంటను ఎవరో ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారా? అన్న చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది. నిజానికి ఆ క్షణంలో ఏపీ థిల్లాన్ ముద్దు పెట్టలేదని, అలాగే వీర్ చూపిన ఎక్స్ప్రెషన్లు ఆ సందర్భానికి సంబంధించినవే కావని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. కాగా, తారా సుతారియా, వీర్ పహారియా 2025లో డేటింగ్ ప్రారంభించారు అన్న ప్రచారం ఉంది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడుపుతూ, కలిసి విహారయాత్రలకు వెళ్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఒక ఫ్యాషన్ ఈవెంట్లో ఇద్దరూ షోస్టాపర్లుగా కలిసి కనిపించడం పుకార్లకు మరింత బలం ఇచ్చింది. ణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా తమ రిలేషన్‌ను బహిరంగంగా అంగీకరించిన ఈ జంట, డేటింగ్ విషయంలో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేసింది.