Harish Rao | పదేండ్లు తట్టెడు మట్టి ఎత్తకుండా కాంగ్రెస్ సర్కార్ కాలయాపన : హరీశ్ రావు
Harish Rao | రాజకీయాల కోసమో, కమీషన్ల కోసమో తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కూడా ఢిల్లీలో మాట్లాడారు.. ఒక అబద్దాన్ని 100 సార్లు చెబితే అది నిజమైతదన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం శైలి ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు...
Harish Rao | ఈ మధ్యకాలంలో సహవాస దోషంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ… రాజకీయాల కోసమో, కమీషన్ల కోసమో తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కూడా ఢిల్లీలో మాట్లాడారు.. ఒక అబద్దాన్ని 100 సార్లు చెబితే అది నిజమైతదన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం శైలి ఉంది.. అసెంబ్లీ సాక్షిగా నిండు శాసనసభలో కుండబద్దలు కొట్టినట్టుగా మీకు సమాధానం చెప్పాం.. మీ నోర్లు మూయించామన్నారు.
తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవని కేంద్ర జన వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖలను ఆధారాలతో సహా శాసనసభ సాక్షిగా బయటపెట్టి మీ నోళ్లు మూయించామన్నారు హరీశ్ రావు.. నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్ట్ కడితే నీళ్లున్న చోటుకు ప్రాజెక్టును మార్చి మీరు వృదా చేసినదాన్ని.. మీరు చేసిన తప్పును మేం సరిదిద్దాం.. మీరు ఖర్చు పెట్టిన డబ్బు వృధా కాకుండా సద్వినియోగం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టును ప్రతిపాదిస్తే.. నీళ్లున్న చోటకు బీఆర్ఎస్ మార్చింది. ఇది మేం చెప్పింది కాదు.. ఈ దేశంలో అత్యున్నత విభాగమైన కేంద్ర జలవనరుల సంఘం సెంట్రల్ వాటర్ కమిషన్), కేంద్ర జలవనరుల శాఖ చెప్పిందని గుర్తు చేశారు.
మీరు పెట్టే ఖర్చంతా వృధా..
అదే విధంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టి పనులు చేయకుండా కమీషన్లు కొట్టిర్రు.. బీఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేసి పారదర్శకపద్దతుల్లో పనులు జరిపించామన్నారు హరీశ్ రావు.
ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నరు. తప్పు చేసింది మీరు. నీళ్లు లేని చోట ప్రాజెక్టులు ప్రతిపాదించింది మీరు.. 7 సంవత్సరాలు ఢిల్లీలో, మన రాష్ట్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అనుమతులు తేకుండా కాలయాపన చేసింది మీరు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్ మా అనుమతి లేకుండా అడ్డగోలుగా ఇష్టమున్నట్టు ప్రాజెక్ట్ కడుతున్నరు.. మీరు పెట్టే ఖర్చంతా వృధా అవుతుంది. అధికారికంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రికి లేఖా రాశారు. సిగ్గు పడాలి.. మీరు చేసిన తప్పుకు కేంద్రప్రభుత్వం నీళ్లు లేవని తప్పు పట్టింది.. మీరు పెట్టే ఖర్చు వృధా అవుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి తప్పు పట్టారు.. మీరు ఢిల్లీలో బీఆర్ెస్ తప్పు చేసిందని మాట్లాడుతున్నవ్.. నాడు 7 ఏండ్లు.. నేడు మూడేండ్లు.. మొత్తం పదేండ్లు కాలయాపన చేసింది.. తట్టెడు మట్టి ఎత్తనిది కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
Live: సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశం https://t.co/YeeeyhMHHz
— BRS Party (@BRSparty) November 16, 2026
Read Also :
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటు ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పదేండ్లు తట్టెడు మట్టి ఎత్తకుండా కాంగ్రెస్ సర్కార్ కాలయాపన : హరీశ్ రావు
Health Tips | కోడిగుడ్డు పచ్చసొన తింటే ఒంట్లో చెడు కొవ్వు పెరుగుతుందా.. ?
Foods In Fridge | ఆహారాలను ఫ్రిజ్లో ఉంచి పదే పదే వేడి చేసి తింటున్నారా.. ఎలాంటి వ్యాధులు వస్తాయంటే..?
డైవర్షన్ రోడ్డును పునఃరుద్దరించాలని కంపగూడెం గ్రామస్తుల ధర్నా
Tamil Nadu | తమిళనాడులో ఘోరం.. చేపలు పట్టడానికి వెళ్లి, చెరువులో మునిగి.. ముగ్గురు బాలురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

