Talasani Srinivas Yadav | రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఎన్నో అద్భుతాలు చూశారని.. రాష్ట్రం సాధించడం ఒక్క అద్భుతమైన ఘట్టం అని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని అనేక ప్రాజెక్ట్ లు నిర్మించారన్నారు.
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గతంలో నీరు, విద్యుత్ లేక రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడ్డారని.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడితే కేసీఆర్ పంట సహాయం చేశారని తలసాని అన్నారు. నేను టీడీపీలో ఉన్నపుడు 5గంటలకు మించి విద్యుత్ రాకపోయేది. అందరి పోరాటం వల్ల వచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. సిద్దిపేటను హరీష్ రావు బాగా అభివృద్ధి చేశారు.
రియల్ ఎస్టేట్ రంగం కాంగ్రెస్ ప్రభుత్వం లో కుదేలు అయింది. కేసీఆర్ హయాంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటితే కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు పడిపోయాయన్నారు. కేసీఆర్ తెచ్చిన రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి అభినందించిందని తలసాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదులు మీద పుట్టి అన్ని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది . కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అధికారం నడిపిస్తుందని ఆరోపించారు.
ప్రభుత్వాలు ఎపుడు కూడా శాశ్వతం కాదు..
మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు, మద్యం ఏరులై పారింది. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో గుడ్డిలో మెల్ల లాగా గెలిచిందన్నారు తలసాని. మా కార్యకర్తలు ధైర్యంగా పోరాటం చేసి గెలుపొందారు. రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వాలు ఎపుడు కూడా శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు సరైన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఒక్క ప్రాజెక్ట్ నిర్మించిన దాఖలాలు లేవని.. ఆర్టీసీలో మహిళలకు ప్రీ పెట్టి పురుషులకు డబుల్ రెట్లు పెంచారని తలసాని మండిపడ్డారు.
Mallela Rajasri | బీఆర్ఎస్లో ఛైర్మన్ పదవి అనుభవించి కాంగ్రెస్లోకి జంప్.. బుద్ధిచెప్పిన ఓటర్లు
Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థి మిస్సింగ్