MLC Yadava Reddy | గజ్వేల్, మార్చి 31: కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ముస్లిం, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. ఇవాళ రంజాన్ పర్వదినం సందర్భంగా గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లలో ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి పండుగల సమయంలో సహాయం అందించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ తోఫాను గత రెండేళ్లుగా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం నిరుపేదలను పట్టించుకోవడం లేదన్నారు.
గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్, హరీశ్‌రావుల సహకారంతో షాపింగ్ కాంప్లెక్స్‌లను కోట్లాది రూపాయలతో నిర్మించుకున్నామన్నారు. ఆనాడు నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లతో మజీద్‌లకు కొత్త కళ వచ్చిందన్నారు. కేసీఆర్ ముందు చూపుతో ప్రాజెక్టులను నిర్మించి సాగునీరు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లీం పెద్దలు పాల్గొన్నారు.
AP News | వారం రోజుల నుంచి గుడి ముందు నగ్నంగా పూజలు.. ఉగాది రోజు సజీవ సమాధికి యత్నం!
Jagadish Reddy | ఆ భాషే ఆయన్ను బొందపెడుతుంది.. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ధ్వజం