Vanteru Pratapreddy | గజ్వేల్, జూన్ 24 : రాష్ట్రంలో ఆంధ్రా నాయకుల పెత్తనం నడుస్తుందని, తెలంగాణ నీళ్లను దోచుకునే కుట్రలు జరుగుతున్నయని దాంతో రాష్ట్రానికి, ప్రజలకు తీరని అన్యాయం జరగబోతుందని ప్రభుత్వం మొద్దునిద్ర వీడి కుట్రలను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు.
మంగళవారం నియోజకవర్గ పరిధిలోని 40మంది లబ్దిదారులకు కేసీఆర్ సహకారంతో మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ హక్కులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రా నాయకుల చేతుల్లో పెడుతుందని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమైక్య పాలనలా రేవంత్‌రెడ్డి పరిపాలన ఉందన్నారు. ఎంతో శ్రమించి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని.. కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రాజెక్టు పేరిట పబ్బం గడుపుతూ ఆంధ్రా నాయకులకు వత్తాసు పలుకుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందన్నారు.
అబద్దపు అసత్యపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను నెరవెర్చకుండా దాటవేస్తున్నరని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను గాలికొదిలేసి ప్రజలకు నష్టం చేకూర్చుతున్నరన్నారు. గతంలో సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా గరిష్ట మొత్తాన్ని మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా కోతలు విధిస్తూ నిరుపేదల పొట్ట కొడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నవాజ్‌మీరా, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు రామచంద్రం, కనకయ్య, రవీందర్, స్వామిచారి తదితరులు పాల్గొన్నారు.
Garidepalli : ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం : తాసీల్దార్ కవిత
Weather Report | నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ
Ram Mohan Naidu | బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు