Congress goons | జనగామలో ఇటీవలే కాంగ్రెస్ గుండాలు (Congress goons) రెచ్చిపోయి మంత్రి సీతక్క సమక్షంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై దాడికి యత్నించారని తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే కాంగ్రెస్ నేతలు మరోసారి రెచ్చిపోయారు. నేడు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ గుండాలు దాడికి యత్నించారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో గాంధీ సెంటర్ వద్ద గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయినా ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలో ఉన్నది ఉన్నట్టు అంటే ఉలుకు ఎక్కువ అన్నట్టు.. జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దంటూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో వాగ్వివాదానికి దిగారు.. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని వారికి ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొని వెళ్తున్న ఎమ్మెల్యే కారును అడ్డుకొని కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించగా వారిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు.
ప్రజాస్వామ్యం లో ప్రశ్నించడమే పాపంగా మారిందని.. దాడులకు తెగబడుతున్న కాంగ్రెస్ గూండాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Proteins Makthal | జాతీయ జెండావిష్కరణలో అపశృతి.. ఒకరికి గాయాలు, మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం : వీడియో
ప్రోటీన్లు కావాలంటే నాన్ వెజ్ తినాల్సిన పనిలేదు.. వీటిని కూడా తినవచ్చు..!