Cherial | చేర్యాల, మే 16 : చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలను కలిపి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ కోరారు. చేర్యాల మండలంలోని వీరన్నపేటలో ఇవాళ సీపీఐ గ్రామశాఖ 2వ మహాసభ జరిగింది.
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. చుంచనకోట నుంచి వీరన్నపేట మీదుగా జనగామ, సిద్దిపేట జాతీయ రహదారి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. చేర్యాలలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నబోయిని శ్రీనివాస్, దండబోయిన వెంకటేశ్, ఈరి భూమయ్య, నంగి కనకయ్య, పొన్నబొయిన మహేందర్, నంగి సత్తయ్య పాల్గొన్నారు. అనంతరం గ్రామ కమిటీ కార్యదర్శిగా పొన్నబోయిన శ్రీనివాస్, సహాయదర్శులుగా చిగుళ్ల నరేష్, బింగి లింగం, కోశాధికారిగా చిగుళ్ల నాగరాజు, సోషల్ మీడియా అధ్యక్షుడిగా పిల్లికండ్ల నర్సింహులు ఎన్నికయ్యారు.
Water tank | పాఠశాలలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్.. భయందోళనలలో విద్యార్థులు
Badibata program | నిజాంపేట మండల వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం
Huge Donation | తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త గోయాంక భారీ విరాళం