Labour Codes | చేర్యాల, జూలై 7 : పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే, కార్మికవర్గాన్ని బలిచ్చేందుకు కేంద్రంలోని సర్కారు 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని వెంటనే వాటిని రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
సోమవారం పార్టీ కార్యాలయంలో ఎండీ కరీం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ.. నాలుగు లేబర్‌కోడ్స్‌ను రద్దు చేయాలని ఈ నెల 9న దేశ వ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని అన్ని రంగాల కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
దశాబ్ధాలపాటు కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గం పై ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు కొంగరి వెంకట్‌మావో, బండకింది అరుణ్‌కుమార్, గొర్రె శ్రీనివాస్, కనకయ్య, కుమార్, సంపత్, తిరుపతి,మల్లేశం, రాజు, ప్రభాకర్ పాల్గొన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్‌కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్‌సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు