CC Cameras | రాయపోల్, ఆగస్టు 07 : కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా రామారం గ్రామంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు దుర్గాప్రసాద్, హనుమంతు, గోపాల్, మహేష్ గౌడ్ వారి సహాయ సహకారాలతో గ్రామంలో (10) సీసీ కెమెరాలు ప్రధాన కూడళ్లలో ఎంట్రీ, ఎగ్జిట్ ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. ఈ రోజు గజ్వేల్ ఏసీపీ యం నరసింహులు, తొగుట సీఐ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ మానస, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలతో కలిసి ప్రారంభించారు. ఏసీపీ నరసింహులు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను అభినందించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని.. సీసీ కెమెరాలు ఉన్న గ్రామాల్లో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదన్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని.. సీసీ కెమెరాలు మరింత భద్రత, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పిస్తాయని తెలిపారు. రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని తెలిపారు. సీసీ కెమెరాలు ఉండి పని చెయ్యని గ్రామాలలో, సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారస్తులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు, రిపేర్ చేయడానికి డివిజన్ పోలీసులకు సహకరించాలని సూచించారు.
గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రతి ఒక్కరూ నిఘా ఉంచాలని ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా యువకులు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. జరుగుతున్న సైబర్ నేరాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని.. ఎలాంటి లింకులు వచ్చినా ఓపెన్ చేయవద్దని సూచించారు. మానవ తప్పిదం వల్లనే సైబర్ నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
COtton Crop | పత్తిలో అంతర పంటల సాగుతో చీడ పీడల నివారణ : శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పల్లవి
Harish Rao | రెండేండ్ల కాంగ్రెస్ పాలన ప్రజలను కష్టాల పాలు చేసింది : హరీశ్ రావు
BRS | కార్యకర్తలకు బీఆర్ఎస్ పాటీ అండగా ఉంటుంది : వల్లుంపల్లి కరుణాకర్