దేవరకొండ రూరల్, ఫిబ్రవరి 21 : దేవరకొండ పట్టణంలో బీసీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులకు దేవరకొండ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్, బీసీ పొలిటికల్ యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి సతీష్ గౌడ్ శనివారం పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. బాగా చదివితే పై చదువులకు సైతం తమ సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. బీసీ పొలిటికల్ యువజన జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డెన్ రేణుక, సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తోటపల్లి మల్లేష్, విద్యార్థి సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సురకారపు సత్య గౌడ్, మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి సత్యం, మండల యూత్ అధ్యక్షుడు పోతురాజు ధనరాజ్ యాదవ్ పాల్గొన్నారు.