NZ vs PAK | పాక్, కివీస్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. తొలి బంతి మరింత ఆలస్యం..!
NZ vs PAK : పొట్టి ప్రపంచకప్‌లో కీలకమైన సూపర్ 8 ఆరంభ పోరుకు వర్షం(Rain) అంతరాయం కలిగిస్తోంది. పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ టాస్ పడిందో లేదో ప్రేమదాస స్టేడియంలో వాన అందుకుంది.
NZ vs PAK : పొట్టి ప్రపంచకప్‌లో కీలకమైన సూపర్ 8 ఆరంభ పోరుకు వర్షం(Rain) అంతరాయం కలిగిస్తోంది. పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ టాస్ పడిందో లేదో ప్రేమదాస స్టేడియం(Premadasa Stadium)లో వాన అందుకుంది. చిన్నగా మొదలైన చినుకులు అంతకంతకూ పెరగడంతో సిబ్బంది పిచ్‌తో పాటు ఔట్‌ఫీల్డ్‌ను కవర్లతో కప్పేశారు. దాంతో.. పాక్, కివీస్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. వరుణుడు ఎప్పుడు శాంతిస్తాడు? ఆట ఎప్పుడు మొదలవుతుంది? అని ఇరుజట్ల ఆటగాళ్లు, అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ప్రపంచకప్ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడడం ఇది రెండోసారి. లీగ్ దశలో గ్రూప్ బీలోని ఐర్లాండ్ జింబాబ్వే మ్యాచ్‌ను అడ్డుకున్న వరుణుడు.. చివరకు ఆస్ట్రేలియా నిష్క్రమించడానికి కారణమయ్యాడు. ఈసారి సూపర్ 8లో మొదటి మ్యాచ్‌కే అంతరాయం కలిగిస్తున్నాడు. ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా బ్యాటింగ్ ఎంచుకున్న కాసేపటికే.. చినుకులు షురూ అయ్యాయి.
Colombo, please get better soon 🤞 pic.twitter.com/YdiNsckO51
— ESPNcricinfo (@ESPNcricinfo) February 21, 2026
అప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండడంతో అప్రమత్తంగా ఉన్న సిబ్బంది వర్షం మొదలవ్వగానే కవర్లతో పిచ్‌ను, ఔట్‌ఫీల్డ్‌ను పూర్తిగా కప్పేశారు. వాన తగ్గాక.. ఔట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేశాక తొలి బంతి పడుతుంది. ఒకవేళ ఓవర్లు కుదించి అయినా మ్యాచ్ జరిపించే అవకాశముంది.
పాకిస్థాన్ తుది జట్టు : సహిబ్జద ఫర్హాన్, సయీం ఆయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజాం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీం అష్రఫ్, సల్మాన్ మిర్జా, ఉస్మాన్ తారీఖ్.
న్యూజిలాండ్ తుది జట్టు : టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), జేమ్స్ నీషం, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

