CC Cameras | తొగుట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట్రావుపేట గ్రామంలో సోలార్ సిస్టంతో 04 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామస్తులు రఘుపతి రావు, కనకాల నర్సింలు ,పెంటోజి, అంజయ్య గౌడ్, పంది రాజు, మిద్దె సంతోష్, కోటి, సూరజ్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ మేరకు తొగుట సిఐ లతీఫ్, ఎస్ఐ రవికాంత్ రావు, గ్రామ వీపీఓ, దాతలతో కలిసి సీసీ కెమెరాలు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా తొగుట సిఐ లతీఫ్ మాట్లాడుతూ.. తొగుట సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, వివిధ సంఘాల నాయకులు సహకరించాలని సూచించారు.
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు.నూతనంగా సోలార్ సిస్టమ్తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఇదే మొదటిదని తెలిపారు. సీసీ కెమెరాలు ఉన్నచోట నేరస్తులు నేరం చేయడానికి వెనుకడుగు వేస్తారని చెప్పారు. ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ రక్షణ కల్పించడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో ముఖ్యమైన కేసులు చేదించడం జరిగిందన్నారు. సైబర్ నేరాల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి..
సోషల్ మీడియా అవసరం మేరకే ఉపయోగించుకోవాలని తెలిపారు. గంజాయి, ఇతర మత్తుపదార్థాల నిర్మూలనకు ప్రజల సహకారం చాలా ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. వారి ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని తెలిపారు. గ్రామంలో ఏవైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని.. లేదంటే డయల్ 100 కాల్ చేసి తెలపాలని సూచించారు. ప్రజల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన దాతలను గ్రామ వీపీఓ కానిస్టేబుల్ భానును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలు తొగుట పోలీస్ సిబ్బంది నాగరాజు, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Nennela | నెన్నెల మండలంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి : ఎంపీడీవో మహ్మద్ అబ్దుల్
Annamalai | బీజేపీ నేత అన్నామలై చేతులమీదుగా మెడల్ అందుకోవడానికి నిరాకరించిన యువకుడు.. వీడియో
Hyderabad | ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. మెహిదీపట్నంలో ప్రమాదం