MLA Harish Rao | సిద్దిపేట, ఏప్రిల్ 19 : తెలంగాణలో మైనార్టీలకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం య్రాతికులకు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇవాళ సిద్దిపేటలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యకమానికి ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీల కోసం చాలా చేశామని. ప్రతీ సంవత్సరం రూ.1500 నుంచి 1800 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టామన్నారు. కాంగ్రెస్ హయాంలో బడ్జెట్ రూ.3 వేల కోట్లు ప్రకటించినా.. కేవలం 200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని.. మిగతా 800 కోట్లు కేసీఆర్ స్థాపించిన మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్స్‌కి ఖర్చు పెట్టారన్నారు. మిగతా రూ.2 వేల కోట్లు ఎక్కడని హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరార్థం అయినా మంత్రి పదవి ఇవ్వడానికి ఇప్పటివరకు మైనార్టీ నాయకుడే దొరకడం లేదా..? అన్నారు. మైనార్టీలకు కష్టం వస్తే ఎవరికీ చెప్పుకుంటారన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు రాష్టంలో ఎక్కడా గొడవలు జరుగలేవు.. కానీ ప్రస్తుతం అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఎటు చూసినా హిందూ ముస్లిం గొడవలే జరుగుతుయన్నారు. ఇలాంటి గొడవలు దేశ, రాష్ట అభివృద్ధికి మంచివి కావన్నారు. బీఆర్ఎస్ హయాంలో విదేశీ నిధులు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే.. కాంగ్రెస్ హయాంలో ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్నాయన్నారు.
మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలిందని గతంలో ప్రతీ రోజు 80 నుంచి 90 ఫైళ్ల వరకు రిజ్రిస్టేషన్లు జరిగేవని ప్రస్తుతం లోన్ల కోసం మార్టిగేజ్ రిజ్రిస్టేషన్లు మాతమే జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట రెవెన్యూ గ్రోత్ 12% గా ఉండేదని.. కానీ ఇప్పుడు మొత్తం గ్రోత్ పడిపోయిందన్నారు. ఏదేమైనా కాంగ్రెస్‌ను మరో మూడేండ్లు భరించాలని హరీశ్ రావు అన్నారు.
Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు..
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్