Building Owners | చేర్యాల, జూలై 7 : జాతీయ రహదారి 365(బి) విస్తరణ పనుల్లో భాగంగా పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా కొనసాగుతున్న కూల్చివేతలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం భవనాల యాజమానులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఆందోళన చేస్తున్న ప్రదేశానికి చేరుకుని వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అనంతరం పలువురు యాజమానులు మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ వల్ల తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న భవనాలు కూలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ సందర్భంగా మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని.. తమకు నోటీసు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. కూల్చివేతలు నిలిపివేయాలని లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్‌కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్‌సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు