Double Bedroom Houses | హుస్నాబాద్ పట్టణంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం తక్షణమే పూర్తి చేసి వాటిని లబ్ధిదారులకు అందించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పేదలు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్‌కు ఈ విషయమై వినతిపత్రం సమర్పించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 70% పూర్తయ్యాయని.. ఈ లోపే ఎన్నికలు రావడంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని వారు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున రెడ్డి ఆరోపించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ సమస్యను పలుమార్లు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వివరించేందుకు అనేకమార్లు తిరిగినా మంత్రి పట్టించుకోవడంలేదని ఇప్పటికైనా ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి పేదలకు అప్పగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనకు వెనుకాడేది లేదని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేకల వికాస్ యాదవ్, వాల నవీన్ రావు , బత్తుల జగ్జీవన్తో పాటు పలువురున్నారు.
Inter Results | ఈనెల 22న ఇంటర్ ఫలితాలు..
Dilip Ghosh | 60 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడిన బీజేపీ నేత.. ఫొటోలు వైరల్