Brahma kamalam | రాయపోల్, జులై 30 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన సత్తు గారి తిరుపతి రెడ్డి ఇంట్లో ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు బ్రహ్మకమలం పువ్వులు వికసించాయి. ఆదివారం ఉదయం చెట్టుకు ఐదు బ్రహ్మకమలం పువ్వులు వికసించాయి. అరుదుగా పూసే ఈ బ్రహ్మకమలం పువ్వులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూస్తాయి.
రాయపోల్ మండల కేంద్రానికి చేందిన తిరుపతి రెడ్డి తన ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలు పెంచుతుండగా.. అందులో బ్రహ్మకమలం పూలు పూయడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కానీ బ్రహ్మకమలం పూలు శనివారం అర్ధరాత్రి 12 గంటలకు పూసి తర్వాత ఉండవని పలువురు పేర్కొన్నారు. కాగా చాలా తక్కువగా చిగురించే బ్రహ్మకమలం పూలు.. అందులోనా ఒకేసారి ఐదు బ్రహ్మకమలం పూలు చిగురించడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. వాటికి ప్రత్యేక పూజలు చేశారు.
Yellareddypet | పల్లెను మరిచిన ప్రభుత్వం.. గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం..
Siddaramaiah | డీకే శివకుమార్ పేరెత్తిన కార్యకర్త.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం సిద్ధరామయ్య
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి