Abdul Hameed | రాయపోల్, జూన్ 12 : భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. గురువారం మండల పరిధిలోని శేరిపల్లి బందారం గ్రామంలో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును సందర్శించి రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్య ఏదైనా ఉంటే గ్రామంలోకి వచ్చిన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని.. రెవెన్యూ సదస్సులో మీరు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ చేసి పరిష్కరించాలని అన్నారు. వచ్చిన దరఖాస్తులలో విచారణ పూర్తయిన వాటిని వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు తెలిపారు.
అనంతరం రేషన్ షాప్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర రావు, సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ రావు, జూనియర్ అసిస్టెంట్లు రాజేశ్వర్, సౌజన్య, రికార్డ్ అసిస్టెంట్ శ్రావణ్, ధరణి ఆపరేటర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్