Bhaktha Markandeya Pratistha | రాయపోల్, ఏప్రిల్ 27 : రాయపోల్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ భక్త మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. గ్రామంలో పద్మశాలి సంఘం సభ్యులు నూతనంగా ఆలయం నిర్మించారు. ఆలయాన్ని రంగురంగులతో అలంకరించి విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు.
ఉత్సవాల మొదటి రోజైన సోమవారం ఉదయం గణపతి పూజ, పుణ్యవచనం, బుత్వికరణం, మాతృక పూజ, దేవత ఆహ్వానం, అఖండ దీపారాధన, వాస్తు యోగిని, నవగ్రహ క్షేత్రపాలక, అంకురారోపణ, సర్వతో భద్ర, మంటప పూజ, అగ్ని ప్రతిష్ట, జులాదివాసం, అవహిత దేవత పూజ, మంగళ హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
అదే రోజు సాయంత్రం ద్వారా తోరణ పూజ, నిత్య హోమం, మూల మంత్ర హోమం, పూర్ణాహుతి, శిరాధివాసం, బలిహరణ, ఆరగింపు, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రెండో రోజు మంగళవారం ఉదయం గణపతి పూజ, అవహిత దేవతల పూజలు, హోమాలు, మూల మంత్ర హవనం, రుద్ర సుక్త, లక్ష్మి సుక్త, మాన్య సూక్త, హవనములు, ప్రసాద సంస్కారం, దాబ్యాధివాసం, శయ్యాది వసం, పుష్పాది వాసం, అవహేత పూజ, మంగళ హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం తదితర కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఉత్సవాలను చివరి రోజైన బుధవారం ఉదయం గణపతి పూజ, స్థాపిత దేవత పూజలు, మూలమంత్ర అవణములు, గర్త సంస్కారంలు.. 10 గంటలకు రోహిణ నక్షత్ర యుక్త మిధున లగ్న పుష్కరాంశమున యంత్ర ప్రతిష్ట, శ్రీ భక్త మార్కండేయ స్వామి మూర్తి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
భక్తులకు అన్నదాన కార్యక్రమం..
ప్రతీ ప్రతిష్ట తర్వాత భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిష్ట మహోత్సవాలకు పురోహితులు వెంకటేశ్వర శర్మ, త్రివేణి వేణుగోపాల శర్మ, పార్వతీ ఆంజనేయ శర్మ తదితర పురోహితులు హాజరవుతున్నట్లు తెలిపారు.
రాయపోల్తోపాటు ఆ గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్త మార్కండేయ స్వామి ప్రతిష్ట మహోత్సవాలను విజయవంతం చేయాలని గ్రామ పద్మశాలి సంఘం పిలుపునిచ్చింది. ఇప్పటికే గ్రామంలో ఆలయం వద్ద కన్నుల పండుగ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మార్కండేయ స్వామి ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Giloy | సర్వ రోగ నివారిణి.. తిప్పతీగ.. మన చుట్టూ పరిసరాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది..!
Putta Madhukar | మంత్రి పదవి మంథనికి పైస మందం కూడా పనికొస్తలేదు : పుట్ట మధుకర్
BRS | బీఆర్ఎస్ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు : దాసరి మనోహర్ రెడ్డి