CI Latheef | రాయపోల్, అక్టోబర్ 16 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంసాగర్ గ్రామంలో బుధవారం రాత్రి కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొగుట సిఐ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ మానస మాట్లాడుతూ.. ఆశ, భయం, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకు అధికారులు అని ఫోన్ చేస్తే నమ్మవద్దు, అకౌంట్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ గుర్తుతెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దు, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తుండాలి..
గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని ఎక్కడికి వెళుతున్నారు.. ? ఎవరెవరితో తిరుగుతున్నారు..? ఒక కన్నేసి ఉంచాలని తెలిపారు. ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసలు అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స, కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఇప్పుడే వస్తాము తక్కువ దూరం కదా అని హెల్మెట్ పెట్టుకోకుండా అశ్రద్ధ చేయవద్దు. రోడ్డు ప్రమాదం ఎవరికి ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు, ఎంత పెద్ద రోడ్డు ప్రమాదమైనా తలకు దెబ్బతగలకుండా ఉంటే బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రోడ్డు విశాలంగా అయినందున రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి, మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి.
సీసీ కెమెరాల ఏర్పాటు గురించి గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు. సీసీ కెమెరాలు 24 గంటలపాటు ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీని ఇస్తాయని తెలిపారు. మంత్రాలు, తంత్రాలు అంటూ మూఢనమ్మకాలు నమ్మవద్దన్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడి మీరు మీ కుటుంబాలను రోడ్డున పడవేయవద్దని సూచించారు.
మూఢనమ్మకాలు, చేత బడులు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలు, సామాజిక రుగ్మతల గురించి సిద్దిపేట పోలీస్ కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు రామారావు, ఎల్లయ్య, నర్సయ్య, ఎల్లయ్య, శేఖర్ నాటకం పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు, యువతి యువకులు, తదితరులు పాల్గొన్నారు.
Devarakonda Rural : 18న నిర్వహించే బీసీ బంద్‌ను జయప్రదం చేయాలి : సతీశ్ గౌడ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.