Ashrith Kumar | సిద్దిపేట, ఏప్రిల్ 21 : మురికి కాలువల్లో కవర్లు, మురుగు పేరుకపోవడం వల్ల మురికి కాలువలు నిండి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని.. వెంటనే డ్రైనేజీలను శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్‌కుమార్ పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ఇవాళ పట్టణంలోని 5, 11,12 వ వార్డుల్లో పర్యటించారు.
ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. నివాస ప్రాంతాల పరిసరాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు, చెట్లు తొలగించి శ్రుభం చేసుకునేలా స్థలం యజమానులకు నోటీసులు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. 12వ వార్డులో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని జవాన్‌ను ఆదేశించారు.
షాప్ బయట చెత్తను గమనించి.. వారిని పిలిపించి చెత్తను అక్కడినుండి తీసి వేయించారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీనగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై వచ్చిన ఫిర్యాదుల మేరకు యూజీడీని పరిశీలించారు. యూజీడీ కనెక్షన్ కోసం ఛాంబర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్య్రకమంలో ఏఈ శ్రీనాథ్, సిబ్బంది పాల్గొన్నారు.
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం