Polytechinic Colleges | గజ్వేల్, జూలై 17 : గజ్వేల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వెంకటకృష్ణారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలోని డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ (డీఈసీఈ), డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (డీఎంఈ), డిప్లొమా ఇన్ కంప్యూటర్ కమర్షియల్ ప్రాక్టీస్(డీసీసీపీ) కోర్సుల్లో ఖాళీలకు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తామన్నారు.
పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్ష రాయని వారికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి కళాశాలలో సమర్పించాలన్నారు. ఆగస్టు మాసంలో స్పాట్ అడ్మిషన్ తేదీని ప్రకటిస్తామన్నారు. ఈ అవకాశాన్ని పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకొవాలన్నారు.
Siddipeta | రైతుల గోస రేవంత్ రెడ్డికి వినబడట్లేదా..? : జీడిపల్లి రాంరెడ్డి
Oil Palm | ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు..
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ కల్లు.. కొత్త పుంతలు తొక్కుతున్న కల్తీకల్లు వ్యాపారం..