SI Arun kumar | రాయపోల్, ఆగస్టు 18 : వర్షాలు కురుస్తున్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్ ప్రజలకు సూచించారు. సోమవారం ఆయన పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలన్నారు. వర్షాల కారణంగా రైతులు, ప్రజలు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ పరికరాలు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
వాహనదారులు రోడ్డుపై అతివేగంగా ప్రయాణించవద్దని.. గ్రామాల్లో కల్వర్టులు, బ్రిడ్జిలు, పరిసర ప్రాంతాల్లో ఉండొద్దని హెచ్చరించారు. గ్రామాల్లో చాలామంది యువకులు చెరువులు, కుంటల్లో ఈత కోసం, చేపలు పట్టేందుకు వెళ్లవద్దని ఎస్ఐ సూచించారు. వర్షాలు కురుస్తున్నందున పాత ఇండ్లలో ఉండవద్దని.. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే 24 గంటలపాటు ప్రజలకు సేవ చేసేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్ఐ అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతులు బయటకు వెళ్లవద్దని.. ముఖ్యంగా గొర్రెల కాపర్లు చెట్ల కింద ఉండవద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాము కూడా అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఇలాంటి సమస్యలు లేకుండా యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ వెల్లడించారు.
Kodangal | అంబులెన్స్ లేక మృతదేహాన్ని తోపుడుబండిలో తరలించిన పోలీసులు.. సీఎం ఇలాకాలో అమానవీయం
Tadipatri | జేసీ ప్రభాకర్ రెడ్డి ఈవెంట్ వల్లే కేతిరెడ్డిని అడ్డుకున్నాం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు
Thorrur | యూరియా కోసం రైతుల బారులు.. కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైన కష్టాలు